స్పేస్‌లో భార రహితస్థితిలో హెయిర్ కటింగ్ చేసుకున్న తొలి భారతీయుడిగా వ్యోమగామి శుభాంశు శుక్లా రికార్డు నమోదు చేశారు. స్పేస్ స్టేషన్‌లో ఉన్న ఆస్ట్రోనాట్ నికోల్ ఆయర్స్.. గ్రూపు కెప్టెన్ శుక్లాకు హెయిర్ కటింగ్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో భూమికి తిరుగు ప్రయాణమైన ఆయన మరికొన్ని గంటల్లో నేలపై దిగనున్నారు.