మోడల్ స్కూల్, కళాశాలను క్షేత్రస్థాయిలో సందర్శించిన కలెక్టర్

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించిన ఆమె, వంటగదిలో వండిన అన్నం, వంకాయ కూర, పప్పు చారు, గుడ్డు నాణ్యతపై ఆరా తీశారు. పప్పు చారు నాణ్యతగా లేదని, కూర అందరికీ సరిపోతుందా అని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్ సక్రమంగా రాయనందుకు ప్రిన్సిపల్‌ను మందలించారు.

సంబంధిత పోస్ట్