దుబ్బాక బస్ డిపోకు అదనంగా బస్సులు కేటాయించి, పలు రూట్లలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ మెదక్ రీజియన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎస్వీజీ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం దుబ్బాక బస్ డిపోను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, డిపో అభివృద్ధి, ఆదాయ మార్గాలు పెంపొందించడంపై అధికారులతో చర్చించారు. అదనపు బస్సులు నడపడానికి తగిన రూట్లను పరిశీలిస్తున్నామని, డిపోకు బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త రూట్లలో బస్సులను నడిపించి ఆదాయ మార్గాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.