గజ్వేల్: నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయము

సిద్ధిపేట జిల్లా గజ్వేల్, రాయపోల్ మండలాల్లోని పలు గ్రామాల్లో నేడు బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని గజ్వేల్ విద్యుత్ శాఖ ఏడీఈ జగదీశ్ ఆర్య తెలిపారు. బెజుగామ 33కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గజ్వేల్ మండలం జాలిగామ, బయ్యారం, చిన్నఆరెపల్లి, బెజుగామ, రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

సంబంధిత పోస్ట్