అక్బరుపేట/భూంపల్లి మండలంలోని ఖాజిపూర్ మల్లన్న ఆలయం నుండి విరారెడ్డిపల్లి, జంగపల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొమ్మట బాలకృష్ణ తెలిపారు. జంగపల్లి చెరువు కట్ట మీదుగా వెళ్లే ఈ మార్గం వర్షాకాలంలో పూర్తిగా చెదిరిపోయి ప్రమాదకరంగా మారిందని, విద్యార్థులు, రైతులు, అత్యవసర వైద్యసేవలు అందించాల్సిన 108 వాహనాలు కూడా ఈ మార్గంలో రావడానికి ఇబ్బందిగా మారిందని ఆయన పేర్కొన్నారు. సంబంధిత ఆర్ఎంబి అధికారులు దృష్టి సారించి రోడ్డు మరమ్మతులు చేయాలని ఆయన కోరారు.