సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో నాలుగు కమ్యూనిటీ సీసీ కెమెరాలను సోమవారం గజ్వేల్ టౌన్ సీఐ రవి కుమార్, బేగంపేట ఎస్‌ఐ మహిపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మద్ద గీత ప్రవీణ్, విపిఓ బి. ప్రేమరాజ్, ఏఎస్ఐలు కలిసి ఆవిష్కరించారు. గ్రామంలో భద్రతను మెరుగుపరచడం, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం ఈ కెమెరాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.