సిద్దిపేట: ప్రజల రక్షణ కోసమే పోలీసులు

సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో “మన పోలీస్ – మన ఊరు” కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, గ్రామాల్లో చిన్నపాటి ఘటనలను గుర్తించి, నివారించడంలో సీసీ కెమెరాలు కీలకమని, ప్రజల ఆస్తి, ప్రాణ భద్రతకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. యువతలో క్రీడా చైతన్యాన్ని పెంపొందించడానికి క్రీడా పోటీలు ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రజలతో పోలీసుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్