విద్యార్థులకు కడుపు నిండా తినేలా సరిపడినంత ఆహారం అందివ్వాలి

సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి బుధవారం దుబ్బాక మండలం దుంపలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సిబ్బందికి కూర నాణ్యతను మెరుగుపరచాలని, విద్యార్థులకు రుచికరంగా వండాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు కొలత ప్రకారం వంట చేసేలా టీచర్లు పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులకు కడుపు నిండా తినేలా సరిపడినంత అన్నం, కూరలు పెట్టాలని, ఇష్టానుసారం పెడితే సహించేది లేదని వంట సిబ్బందిని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్