దుబ్బాకలో తైబజార్ బజార్ వేలంపాట

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని కేంద్రంలో ప్రతి శనివారం జరిగే తై బజార్ కూరగాయల అంగడికి సంబంధించిన వేలం పాటను బుధవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ వేలంలో ఐదుగురు పాల్గొనగా కిష్టంగారి సుధాకర్ రెడ్డి 13 లక్షల 6వేలకు వేలం పాటను పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, వైస్ చైర్ పర్సన్ ఆస సులోచన స్వామి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్