సెక్యూరిటీ రక్షణ కల్పించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర

సిద్దిపేట జిల్లా కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని తిమ్మారెడ్డిపల్లి, మంగోల్ గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొగుట సీఐ లతీఫ్ ప్రారంభించారు. ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ రక్షణ కల్పించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయని, దొంగతనాలను అరికట్టేందుకు ఇవి ముఖ్య భూమిక పోషిస్తాయని ఆయన అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఈ సందర్భంగా ఆయన సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్లు వెంకటేశంగౌడ్, కరుణాకర్, ఎస్ఐ శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్