సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు మాట్లాడుతూ, సీసీ కెమెరాలు భద్రతకు భరోసా కల్పిస్తూ నేరాలను అరికడుతున్నాయని తెలిపారు. మంగళవారం, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల రాజీవ్ రహదారి వెంట ఉన్న హోటళ్లు, షోరూమ్లు, లాడ్జీలు, ఇతర వ్యాపార సముదాయాల యజమానులకు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు అందజేశారు. కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని, రికార్డింగ్ కనీసం 30 రోజుల పాటు ఉండేలా చూడాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు.