నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి: పోలీసు కమిషనర్

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో నేరాలను తగ్గించేందుకు రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయాలని పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన సమీక్షలో, ప్రజలకు మరింత చేరువ కావాలని, స్థానికులతో సమన్వయం చేసుకుంటూ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. సురక్ష నేత్రలో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మన పోలీసు-మన ఊరు కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్