గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు, పిల్లల రక్షణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్ఐ శ్రీరాములు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉద్యోగులు, బయటి వ్యక్తుల నుంచి ఎదురయ్యే వేధింపులను భరించాల్సిన అవసరం లేదని, ఇబ్బందులుంటే షీ టీమ్ కు సమాచారం అందించాలని సూచించారు. మహిళల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. మహిళల రక్షణ కోసమే షీ టీమ్ కృషి చేస్తోందని ఆయన అన్నారు.