గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కొండపాక మండలంలోని జప్తినాచారంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాస దరఖాస్తులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.