ఆకునూరు గ్రామ పంచాయతీకి వేలం పాటల ద్వార రూ. 4. 25 లక్షల ఆదాయం

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొమ్ము రవి, కార్యదర్శి కరీమొద్దీన్ ఆధ్వర్యంలో పంచాయతీ ఆధీనంలో ఉన్న ఏడు షట్టర్లకు వేలం నిర్వహించారు. ఈ వేలం ద్వారా పంచాయతీకి మొత్తం రూ. 4.25 లక్షల ఆదాయం సమకూరిందని కార్యదర్శి కరీమొద్దీన్ తెలిపారు. అందె నానిబాబు రూ. 54,500లకు పాడి తైబజారును దక్కించుకోగా, మిగిలిన ఏడు షట్టర్లను శ్రీనివాస్, అజయ్ కుమార్, మల్లేశం, అహ్మద్, ప్రవీణ్, సమ్మయ్య, రజిత దక్కించుకున్నారు. షట్టర్ల ద్వారా రూ. 3,70,500 ఆదాయం లభించింది.

సంబంధిత పోస్ట్