ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలి

హుస్నాబాద్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అరైవ్, అలైవ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై పోలీసులు వీడియోల ద్వారా అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్