సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్‌పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన 26 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఫిష్ మార్కెట్ నిర్మాణానికి రూ. 15 లక్షలు, మంచినీటి బావుల రక్షణకు రూ. 5 లక్షలు, వనమహోత్సవం కోసం రూ. 30.90 లక్షలు కేటాయించారు.