హుస్నాబాద్: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంపై దృష్టిసారించాలి

హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చైర్పర్సన్, కౌన్సిలర్లు యోగాసనాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఆహారంలో పప్పుదినుసులు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్