హుస్నాబాద్: సీఎం ఏరియల్ సర్వేకు భద్రతా చర్యలు

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నేపథ్యంలో, పోలీసు సిబ్బంది తగిన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు కమిషనర్ ఆదేశించారు. గురువారం ఆయన మార్కెట్ యార్డు, పోలీసు స్టేషన్ ను సందర్శించి, వరదల్లో కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. వరదల వల్ల నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, వరద నీటితో కలిగే ప్రమాదాలను ముందస్తుగా అధికారులతో కలిసి ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి కుశాల్కర్, ఏసీపీ సదానందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్