ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేషన్ పాడు గ్రామ సమీపంలో వివేకానంద స్కూల్ బస్సు బోల్తా పడటంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టితో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.