కోతుల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో కోతులను పట్టివేసే కార్యక్రమం చేపట్టింది. పురపాలక సంఘం చైర్‌పర్సన్ దండి లక్ష్మి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, పట్టణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కోతులను సురక్షితంగా పట్టుకోవడానికి ప్రత్యేక బృందం సహకారంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టణంలో కోతుల సమస్యను పూర్తిగా నివారించడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్