సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో మొత్తం 226 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని కమిషన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో ఒక్క దరఖాస్తు కూడా తిరస్కరణకు గురికాలేదని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి మూడవ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుందని వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.