జిల్లా కలెక్టర్ హైమావతి ఆదివారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, పొన్నాలలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అభ్యర్థుల నుంచి తీసుకోవాలని ఆమె తెలిపారు. జిల్లాలో తొలిదశ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని, రెండోవిడత 10 మండలాల్లో ప్రారంభమైందని అన్నారు. క్లస్టర్ చుట్టూ 100మీటర్ల పరిధిలో నామినేషన్ అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించాలని, బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.