పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతాయని సిద్ధిపేట పోలీసు కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం ఏఎస్ఐ నుండి ఎస్ఐగా ప్రమోషన్ పొందిన ఎన్. ఉమేష్, హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ ప్రమోషన్ పొందిన సదయ్యలను అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.