మెసేజింగ్ యాప్‌లకు సిమ్ బైండింగ్ గడువు పొడిగింపు!

వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఊరట కల్పించింది. భద్రతా కారణాలతో తప్పనిసరి చేసిన సిమ్ బైండింగ్ నిబంధన అమలు గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే గత ఏడాది నవంబర్‌లో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చి 90 రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది. అయితే, అమలులో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కంపెనీలు కోరడంతో గడువును DEC వరకు పొడిగించేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్