జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శనివారం ఆకస్మికంగా పర్యటించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి, ప్రమాదకర శిథిలావస్తలో ఉన్నందున ఆరు గదులను తక్షణమే కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ధర్మపురి ఇన్చార్జ్ తహసిల్దార్ సుమన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.