కథలాపూర్ మండలం కేంద్రంలో మంగళవారం, ఉపాధి హామీ పథకంలో 52 జాబ్ కార్డుల తొలగింపుపై డి.ఆర్.డి.ఏ విజిలెన్స్ అధికారులు వకీల్, దేవేందర్ రెడ్డి విచారణ చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ఉపాధి హామీ సిబ్బందిని విచారించి, జాబ్ కార్డులు ఎందుకు తొలగించారో వివరాలు సేకరించారు. కూలీల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను కూడా అధికారులు నమోదు చేసుకున్నారు.