పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఈనెల 18న నిర్వహించే మెగాజాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు 100కు పైగా కంపెనీలు పాల్గొని 3000 పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఐటీ, ఫార్మసీ నర్సింగ్, డేటా ఎంట్రీ తదితర విభాగాలలో అవకాశాలు ఉండను ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.