సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం స్థల పరిశీలన చేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమీపంలో ఈ నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఆమె అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఎన్పీడీసీఎల్ సీఈ అశోక్ తో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్