రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా డాక్టర్ నాగార్జున చక్రవర్తి నియమితులయ్యారు. అనస్థీషియా డిపార్ట్మెంట్ హెచ్ ఓ డీ గా ఉన్న డాక్టర్ నాగార్జునను, రాష్ట్ర డీఎంఈ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరీ అడ్మినిస్ట్రేటివ్ విభాగం వైస్ ప్రిన్సిపాల్ గా నియమించారు. ఈ నియామకంపై తోటి వైద్యులు, సిబ్బంది డాక్టర్ నాగార్జునకు అభినందనలు తెలిపారు.