రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శుక్రవారం పరిశీలించారు. ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి, పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆయన సూచించారు.