రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె కిచెన్, వంట గది, బియ్యం, పప్పులు, గుడ్లు వంటి ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసి, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు.