వేములవాడలో నిరసన తెలిపిన కౌన్సిలర్స్

వేములవాడ పురపాలక సంఘం కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు. అయితే, కౌన్సిలర్లకు కనీసం వారం రోజుల ముందు సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడంపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. గడువు ఇవ్వకుండా బడ్జెట్ సమావేశం నిర్వహించిన తీరుపై వినతి పత్రం అందజేసి, మినిట్స్ బుక్‌లో నమోదు చేయాలని కోరారు. దీనిపై కమిషనర్ సంపత్ కుమార్ తర్వాత నమోదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్