డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ ఏరియా హాస్పిటల్ ముందు ఉన్న డ్రైనేజీ సమస్యలను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆదివారం కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, మురుగునీటి ప్రవాహం సరిగా లేకపోవడంపై అధికారులతో చర్చించి, వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలను అడిగి తెలుసుకున్న చైర్మన్, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్