మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ గురువారం పరిశీలించారు. ఆయన హెల్ప్ డెస్క్, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, నోడల్ అధికారులు గీత, నవీన్ కుమార్, భారతి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, టీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.