గోశాలలో తనిఖీలు – గోవుల సంరక్షణపై ఈవో దృష్టి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు. గోవులను ఎండ వేడిమి నుండి రక్షించేందుకు గ్రీన్ నెట్, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి చర్యలను వారు పరిశీలించారు. గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాలను కూడా సమీక్షించారు.

సంబంధిత పోస్ట్