శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, డిసెంబర్ 1 నుండి 31 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కాలంలో పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా డి.జే. వినియోగించరాదని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.