రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి భద్రతా నియమాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. విద్యార్థుల నుంచి వాహనదారుల వరకు అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. ఓవర్ లోడు, పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దని, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కోసం వ్యాస, డ్రాయింగ్ పోటీలు, ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రమాదకర మూలమలుపుల వద్ద సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.