ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ ఏ శ్రీనివాస్‌ను సంస్కృత విద్యార్థుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించింది. రాజన్న సన్నిధిలో సేవ చేసే భాగ్యం లభించినందుకు విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్కృత విద్యార్థి సంఘం అధ్యక్షులు అల్లాడి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరగోని చైతన్య గౌడ్ పాల్గొన్నారు.