జనగణన–2027లో స్వీయ గణన పూర్తి చేసిన ఎస్పీ మహేష్ బి. గితే

జనగణన–2027లో భాగంగా ఆదివారం రోజున జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యుల వివరాలను జనగణనలో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. సరైన సమాచారం అందించడం ద్వారా సమగ్ర గణాంకాలు అందుబాటులోకి వస్తాయని, జనగణన విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు చురుకుగా పాల్గొని బాధ్యతగా వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్