న్యాయవాదుల సమస్యలపై స్పందిస్తా: పిట్టల మనోహర్

వేములవాడ నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల మనోహర్, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. బుధవారం బార్ హాల్లో ఎన్నికల అధికారి తిరుమల్ గౌడ్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన ఇబ్బందుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, కోర్టు వసతుల అభివృద్ధి, యువ న్యాయవాదులకు ప్రోత్సాహం, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని మనోహర్ వెల్లడించారు. అన్ని వర్గాల న్యాయవాదులను కలుపుకొని ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్