మహిళలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలు, విద్యార్థినులు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా సంప్రదించాలని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ సూచించారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో యాక్ట్/లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి నెలలో మహిళలను వేధిస్తున్న పోకిరీలపై 02 కేసులు, 04 పెట్టి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే షీ టీమ్ నెంబర్ 8712656425 కు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భయపడకుండా ధైర్యంగా ముందుకు వస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్