అత్యాధునిక పద్ధతిలో SLBC టన్నెల్ తవ్వకాలు: మంత్రి ఉత్తమ్‌

TG: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన పనులు పునఃప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో టన్నెల్ తవ్వకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమని మంత్రి పేర్కొన్నారు. సిబ్బందికి 25 శాతం అదనపు జీతాలు ఇస్తామని, ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండను సస్యశ్యామలం చేసి ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్