ప్రపంచంలో అత్యంత బద్ధకమైన జీవిగా పేరుగాంచిన స్లాత్, రోజుకు 20-22 గంటలు నిద్రపోతుంది. దీని జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది, ఆహారం అరగడానికి నెల రోజులు పడుతుంది. వారానికి ఒకసారి మాత్రమే మలమూత్ర విసర్జన కోసం కిందకు దిగే ఈ జీవి, తన బద్ధకం వల్లే తరచుగా ప్రమాదాల్లో చిక్కుకుంటుంది. ఈ సోమరితనం ఒక మనుగడ వ్యూహమని, తక్కువ శక్తిని ఖర్చు చేయడం ద్వారా ఆహార కొరతను అధిగమిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. స్లాత్ శరీరంపై పెరిగే నాచు, కీటకాలు దీనిని శత్రువుల నుండి కాపాడతాయి.