తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డ్

టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన వన్డేల్లో అరుదైన ఘనత సాధించారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు చేసిన ఏకైక మహిళా ప్లేయర్‌గా నిలిచారు. ఈ ఘనతను ఆమె వరల్డ్ కప్లో భాగంగా విశాఖ మైదానాంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో సాధించారు. ప్రస్తుత మ్యాచులో భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి (49 నాటౌట్), ప్రతీక (40 నాటౌట్) శుభారంభాన్నిచ్చారు. టీమ్ స్కోర్ 17 ఓవర్లకు 90/0గా ఉంది. ఈ టోర్నమెంట్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్‌కు గత పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైంది.

సంబంధిత పోస్ట్