TG: ఎల్3 కేటగిరీ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయి సర్వేలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల విచారణలో అనర్హులుగా తేలిన వారిని అధికారులు ఎల్3 కేటగిరిలో పెట్టారు. అయితే, ఎల్3లో ఉన్నప్పటికీ ఇల్లు నిర్మాణం ప్రారంభిస్తే ప్రత్యేక అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. అలాగే క్యూర్ పరిధిలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు