ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) గ్రామీణ ప్రాంతాల మహిళలు, స్వయం సహాయక సంఘాల (SHG) కోసం ఒక కొత్త సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించింది. ఈ 'స్వయం సహాయక బృందాల సేవింగ్స్ అకౌంట్' ద్వారా వారికి సులభమైన, సరసమైన బ్యాంకింగ్ సేవలు అందుతాయి. ఈ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి జరిమానాలు ఉండవు, అకౌంట్ ఉచితంగా తెరవవచ్చు. కనీస నిల్వ అవసరం లేదు, ఎలాంటి ఫైన్లు, రసుంలు ఉండవు. డబ్బు డిపాజిట్, విత్‌డ్రాకు సర్వీస్ ఛార్జీలు లేవు. రూ.20 లక్షల వరకు నగదు నిల్వ చేసుకోవచ్చు.