TG: ఇన్సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్-2 నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 7 నుంచి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరిస్తారు. నవంబర్ 16 నుంచి 21 వరకు స్పెషల్ టెట్-2 పరీక్షలు జరగనున్నాయి. schooledu.telangana.gov.inలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. స్పెషల్ టెట్-1 ఫలితాలు గత నెలలో విడుదల కాగా 15,749 మంది అర్హత సాధించారు.