తెలంగాణ విద్యాశాఖ, పదో తరగతి వార్షిక పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత సాధించలేని వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనుంది. ఈ నెల 12వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ప్రతి జిల్లాలో రెండు పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ రెమిడియల్ క్యాంప్‌లు కొనసాగుతాయి. గణితం, సైన్స్ వంటి క్లిష్టమైన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, టిఫిన్, ప్రయాణ ఖర్చులు భరించనుంది.