శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ఆదివారం కేవలం ఒక గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 73,586 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం నుంచి ఔట్‌ఫ్లో 95,677 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులుగా ఉంది.

సంబంధిత పోస్ట్